మోడీపై విరుచుకుపడ్డ సీపీఐ నారాయణ

మోడీపై విరుచుకుపడ్డ సీపీఐ నారాయణ

0
TMedia (Telugu News) :

      మోడీపై విరుచుకుపడ్డ సీపీఐ నారాయణ

టీ మీడియా, ఏప్రిల్ 21, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మోడీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. దేశానికి సేవ చేసిన నెహ్రూ కుటుంబానికి అడుగడుగునా వేధింపులకు గురిచేస్తున్నారని, ఇది సరైంది కాదని అన్నారు. బీజేపీ పెంపుడు కుక్కగా సీబీఐ వ్యవహరిస్తోందని దుయ్యపట్టారు. న్యాయవ్యవస్థ మీద మోడీ ప్రభుత్వం ఒత్తిడి పెడుతోందని ఆయన ఆరోపించారు. గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తిగా మోడీని అభివర్ణించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను డంప్ కేంద్రంగా మోడీ మార్చుతున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. అదానీకి నొప్పి తగలకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోడీ బాబా 30 దొంగల్లా పాలన సాగుతుందని మండిపడ్డారు. దేశంలో 30 మంది దత్తపుత్రులతో పాలన నడుస్తోందని ఆయన అన్నారు.

AlsoRead:అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై సుప్రీం స్టే

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube