రైతాంగ పోరాట ఫలితమే సాగు చట్టాల రద్దు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 19: కొణిజర్ల

కొణిజర్ల మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన సిపిఎం మండల కమిటీ . పార్టీ కార్యాలయం నుంచి కొణిజర్ల సెంటర్ వరకు ర్యాలీగా నిర్వహించారు. ఈ సందర్భంగా గా సిపిఎం వైరా నియోజకవర్గ ఇన్చార్జి భూక్య వీరభద్రం మాట్లాడుతూ ఢిల్లీ రైతుఉద్యమం తో సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటం పోరాట ఫలితం అని నాయకులు తెలిపారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ ఉద్యమంలో మృతి చెందిన రైత అమరులకు నివాళులు అర్పించారు. టపాసులతో సంబరాలు జరిపి మిఠాయిలు పంచారు .ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు కొప్పుల కృష్ణయ్య ,అన్నరపు వెంకటేశ్వర్లు, బోయినపల్లి శ్రీనివాసరావు ,బానోతు హరి చందు, ధరావత్ నంద్యా, తాతా వెంకటయ్య, ధరావత్ నరసింహారావు, బానోతు శ్రీను, లక్ పతి, కావూరి సత్యనారాయణ, చింత నిప్పు సూరయ్య ,తాళ్లపల్లి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube