టి మీడియా,డిసెంబర్,4, భద్రాచలం
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భద్రాచలం పట్టణ కార్యవర్గ.కౌన్సిల్.ప్రజా సంఘాల భాద్యుల సమావేశం పట్టణ కార్యవర్గ సభ్యులు ఏపూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి అకోజు సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిస్కారం కొరకు సిపిఐ ని నిర్మాణ పరంగా బలోపేతం చేద్దామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను గాలికొదిలేసి పబ్బం గడుపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయం లో ఒకరి పై ఒకరు విమర్శలు చేయడం తప్ప రైతులకు న్యాయం చేసే అలోచనలో ప్రభుత్వం లేదని అన్నారు.వానాకాలం వడ్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు ప్రారంభించాలని అన్నారు. భద్రాచలం పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పై పోరాటానికి సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని.
పార్టీ విస్తరణ ద్వారానే ప్రజలకు మేలు జరిగిద్ధి అని అన్నారు. డిసెంబరు 7 నుండి భద్రాచలం పట్టణంలో జరిగే సిపిఐ శాఖ మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ వై కార్యవర్గ కౌన్సిల్,ప్రజా సంఘాల భాద్యులు బల్లా సాయి కుమార్,మీసాల భాస్కరరావు,హిమాం ఖాసీం, నర్సింహులు, శ్రీ రాములు, సీతారాములు,వెంకట్,శ్రీ రాములు,బద్ది బాబీ,గుంజా బాలరాజు,ప్రదీప్,ఆనంద్, నానిపల్లి శ్రీను,వెంకటమ్మ, సుశీల,కుమారి,మారెడ్డి గణేష్, తిరుపతి రావు తదితరులు ఉన్నారు.