సిపిఐ జిల్లా కార్యదర్శిగా రామడుగు లక్ష్మణ్ ఎన్నిక

సిపిఐ జిల్లా కార్యదర్శిగా రామడుగు లక్ష్మణ్ ఎన్నిక

1
TMedia (Telugu News) :

సిపిఐ జిల్లా కార్యదర్శిగా రామడుగు లక్ష్మణ్ ఎన్నిక
టి మీడియా,జూలై25,మంచిర్యాల: జిల్లా సిపిఐ కార్యదర్శిగా రామడుగు లక్ష్మన్ ను ఎన్నుకున్న సందర్భంగా క్యాతనపల్లిలో సోమవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం బైక్ ర్యాలీ తో సూపర్ బజార్,బి జూన్ సెంటర్, అంబేద్కర్ విగ్రహానికి, రామాలయం అమరవీరుల స్తూపానికి, అల్లూరి సీతారామరాజు విగ్రహానికి, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ పూల దండలు వేశారు. అదేవిధంగా నూతనంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా మిట్టపల్లి శ్రీనివాస్ ,జిల్లా సమితి సభ్యుడుగా కాదండి సాంబయ్య, పేర్క సంపత్, మెరుగు రాజేశం లను ఎన్నుకున్న జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.

 

Also Read : అభివృద్ధి ,సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు ,జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ,బ్రాంచ్ కార్యదర్శి ఎండి అక్బర్ ఆలీ మాట్లాడుతూ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన లక్ష్మణ్, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానంపై పోరాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, జిల్లా సక్రమ అభివృద్ధికి, జిల్లా సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం జరుగుతుందని చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube