మిర్చి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 12: కొణిజర్ల

మండల పరిధిలో సింగరాయపాలెం సిద్దిక్ నగర్ తదితర గ్రామాల్లో మిర్చి సాగు చేస్తున్న రైతుల పంట ఏపుగా పెరిగి పుతా కాతా లేకుండా పూర్తిస్థాయిలో రైతులు నష్టపోయారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వైరా అసెంబ్లీ ఇంచార్జ్ భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. ఎకరానికి లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు . ఇప్పటివరకు వ్యవసాయ శాఖ అధికారులు కారణాలు ఏమిటో తెలపలేదని కనీసం పంటలను పరిశీలించి రైతులకు మనోధైర్యం కల్పించలేదని విమర్శించారు . పంట నష్ట పోటానికి నకిలీ విత్తనాలు కారణమా లేదా తెలపాలని డిమాండ్ చేశారు . చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులును ప్రభుత్వం ముందుకు వచ్చి ఆదుకోవాలని తెలిపారు. ఆదుకోపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలిపారు అధికారులు ప్రజాప్రతినిధులు మిర్చి రైతులకు అండగా నిలబడి ప్రభుత్వం నుండి సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులందరిని ఐక్యం చేసి సిపిఎం నాయకత్వంలో పోరాడుతామని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube