ఆర్మీ అభ్యర్థులపై తూటాల వర్షమా

అగ్నిపద్ ని వెంటనే రద్దు చేయాలి

2
TMedia (Telugu News) :

ఆర్మీ అభ్యర్థులపై తూటాల వర్షమా

అగ్నిపద్ ని వెంటనే రద్దు చేయాలి

–సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్

టీ మీడియా,జూన్ 21, పెద్దపల్లి :

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పేద్దపల్లి మండల ఐదవ మహాసభ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెర్క సతీష్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు.మొదటగా జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం సీపీఐ జండాని ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన మండల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్ మాట్లాడుతూ… ఆర్మీ అభ్యర్థుల మీద తూటాల వర్షం కురిపించే హక్కు వారికి ఎవరిచ్చారు అని మండిపడ్డారు.

Also Read : మూడు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణ లొనే కాకుండా దేశ వ్యాప్తంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ఆర్మీ అభ్యర్థులు రైళ్లను ప్రభుత్వం ఆస్తులను కాల్చి వేశారని వాగ్వాదిస్తున్న బీజేపీ నాయకులు అదే ప్రభుత్వ ఆస్తులను మోడీ ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతుంటే నోరు ఎందుకు మెదుపలేదని అన్నారు మోడీ నిరంకుశ పాలనకు లౌకిక పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని ఏకమైన పోరాడాలని లౌకిక భారత దేశాన్ని కాపాడుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం,పెర్క్ సతీష్,చంద్రగిరి ఉదయ్,అరేపెళ్లి మానస్,బొద్దుల రమేష్,ఈదునూరి ప్రేమ్, కొడెం స్వామి,మద్దె

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube