అమిత్ షా పెద్ద క్రిమిన‌ల్.. సీపీఐ నారాయ‌ణ ఫైర్

అమిత్ షా పెద్ద క్రిమిన‌ల్.. సీపీఐ నారాయ‌ణ ఫైర్

1
TMedia (Telugu News) :

అమిత్ షా పెద్ద క్రిమిన‌ల్.. సీపీఐ నారాయ‌ణ ఫైర్

టీ మీడియా, ఆగస్ట్ 22, హైద‌రాబాద్ : రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌పై సీపీఐ నారాయ‌ణ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. చెప్పులు మోసే బీజేపీ నాయ‌కులు త‌మ‌ను విమ‌ర్శించ‌డం స‌రికాద‌న్నారు. మీ బ‌తుకేందో త‌మ‌కు ఇప్పుడు అర్థ‌మైంద‌న్నారు. హోం మినిస్ట‌ర్ పెద్ద క్రిమిన‌ల్. ఆయ‌న ఓ కేసులో 12 మంది సాక్షుల‌ను, లాయ‌ర్ల‌ను హ‌త్య చేయించాడు. అట్లాంటి క్రిమిన‌ల్ వ్య‌క్తి దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌న‌కు హోం మినిస్ట‌ర్ అయ్యాడు. మీరు చెప్పులు మోస్తూ చప్రాసీ ప‌ని చేస్తున్నార‌ని రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : అమిత్‌ షా, ఎన్టీఆర్‌ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు

మీలాంటి వారు క‌మ్యూనిస్టుల‌ను విమ‌ర్శించ‌డం స‌రికాదు. మిమ్మ‌ల్ని ఓడించ‌డానికి దెయ్యంతోనైనా క‌లిసి పోరాడుతాం. కేసీఆర్‌తోనైనా క‌లుస్తాం.. ఇంకెవ‌రితోనైనా క‌లుస్తామ‌ని నారాయ‌ణ‌ తేల్చిచెప్పారు. బీజేపీని ఓడించేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. క‌మ్యూనిస్టుల‌ను విమ‌ర్శించే నైతిక హ‌క్కు బీజేపీ నేత‌ల‌కు లేద‌న్నారు. ఈ దేశాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఎన్నికైన ప్ర‌భుత్వాలు మీకు వ్య‌తిరేకంగా ఉంటే ఈడీ దాడులు చేయిస్తున్నారు. బీజేపీ బ్లాక్‌మెయిల్ రాజ‌కీయాలు చేస్తుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. మీ బానిస‌బుద్ధికి చెప్పులు మోసుకుంటూ తిర‌గండి త‌ప్ప‌.. మీ శ‌క్తికి మించి మాట్లాడ‌కండి అని నారాయ‌ణ‌ సూచించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube