ధర్నా నిర్వహించిన సిపిఐ, ఏఐటియుసి శ్రేణులు

ధర్నా నిర్వహించిన సిపిఐ, ఏఐటియుసి శ్రేణులు

1
TMedia (Telugu News) :

ధర్నా నిర్వహించిన సిపిఐ, ఏఐటియుసి శ్రేణులు

టీ మీడియా,జులై 21,గోదావరిఖని :

రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న 2ఏ.ఇంక్లయిన్ రైల్వే అండర్ బ్రిడ్జి ని వెడల్పు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం టూఏ వంతెన వద్ద సిపిఐ, ఏఐటియుసి శ్రేణులు ధర్నా నిర్వహించారు.ధర్నా అనంతరం సిపిఐ సీనియర్ నాయకులు కే.స్వామి, నగర కార్యదర్శి కే.కనకరాజ్,ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ లు మాట్లాడుతూ… స్థానిక టూఏ రైల్వే అండర్ బ్రిడ్జి ని వెడల్పు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు చేసినప్పటికీ ని సింగరేణి యాజమాన్యం గాని, రామగుండం కార్పొరేషన్ గాని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇట్టి వంతెన నుంచి సింగరేణి ఉద్యోగులు ఆయా కాలనీల నుండి విధులకు వెళ్తారని, అదేవిధంగా ముస్త్యాల, సుందిల్ల గ్రామ ప్రజలు నిత్యం గోదావరిఖని కి తమ అవసరాలకోసం ఈ వంతెన నుంచి వెళతారని వారు పేర్కొన్నారు.గోదావరిఖని లోని వివిధ కాలనీల్లోని మురికి నీరు ఈ వంతెన నుంచి వెళ్ళడం వల్ల వర్షా కాలంలో వర్షం నీరు, మురికి కాలువ నీరు ఈ వంతెన వద్ద కాలువ ఇరుకుగా ఉండడం వల్ల నీరు బయటకు సరిగా వెళ్ళక, వంతెన వద్ద నిలుస్తుందని, దీని వల్ల ఈ వంతెన నుంచి వాహనదారులు, ప్రజలు, కార్మికులు,ఉద్యోగులు రాక పోకల తో ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.అదేవిధంగా వంతెన ప్రక్కన ఉన్న ప్రధాన మురికి కాలువ కు ఇరువైపులా లెనిన్ నగర్, వినోబా నగర్,సీతానగర్, మల్లిఖార్జున నగర్, రాంనగర్ బస్తీల ప్రజలు వర్షాకాలంలో మురికి నీరు సరిగా వెళ్ళక,నిలువ ఉండి, పాములు ఇండ్ల లోకి వస్తున్నాయని,మురికి నీరు ఇండ్ల లో బయటకు పోకపోవడం వల్ల బస్తీల ప్రజలు అనేక అవస్తలు పడుతున్నారని వారు పేర్కొన్నారు.

 

Also Read : చిన్నారి వర్షితది ఆత్మహత్యే

 

ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు ఇట్టి సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం చెందారని వారు విమర్శించారు. అదేవిధంగా సింగరేణి యాజమాన్యం కూడా ఈ వంతెన ను అభివృద్ధి చేయడం లో నిర్లక్ష్యం చేస్తూ,ప్రజలను, కార్మికుల ను ఇబ్బందులకు గురి చేస్తుందని వారు ఆరోపించారు.రామగుండం కార్పొరేషన్ కు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నుండి 100 కోట్ల రూపాయలు నిధులు వస్తున్న ఎందుకు ఈ వంతెన ను అభివృద్ధి చేయడం లేదని వారు విమర్శించారు.సింగరేణి యాజమాన్యం కూడా సి.ఎస్.ఆర్ నిధులు, డిఎంఎఫ్టీ నిధులు కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల కోసం కెటాయింపులు చేసినప్పటికీ ని ఈ వంతెన అభివృద్ధి కోసం ఎందుకు ఖర్చు చేయడం లేదని వారు ఆరోపించారు.ఈ వంతెన వల్ల ప్రజలు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నా వారి ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు, నగర పాలక సంస్థ అధికారులు సింగరేణి అధికారులు అభివృద్ధి చేయడం కోసం పట్టించుకోరా అని వారు ప్రశ్నించారు.ఇప్పటికైనా ప్రభుత్వం,సింగరేణి యాజమాన్యం స్పందించి టూఏ రైల్వే అండర్ బ్రిడ్జి ని వెడల్పు చేసి, ప్రజలకు, కార్మికుల కు సౌకర్యంగా ఉండే విధంగా అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు,లేనిచో సిపిఐ, ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం,జి.ఎం కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్,నగర సహాయ కార్యదర్శులు తాళ్ళపెల్లి మల్లయ్య,మద్దెల దినెష్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తోడుపునూరి రమేష్ కుమార్,రంగు శ్రీనివాస్,శనిగరపు చంద్ర శేఖర్,పడాల కనకరాజు, బూడిద మల్లేష్,అబ్ధుల్ కరీం,గని,రమేష్ గౌడ్, సిరిసిల్ల మల్లేష్,కీర్తీ కొమరయ్య,నాని తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube