సిపిఐ(యం) ఆద్వర్యంలో “సేవ్ ఇండియా” నినాదంతో నిరసన

నాడు తెల్లదొరల పాలనలో అనచబడ్డ భారతజాతి క్విట్ ఇండియా నినాదంతో స్వతంత్ర్యం సాదించిందని కానీ నేటి పాలకులు ప్రజలకు ఉపయోగపడే చట్టాలను విదేశీ సంస్తలకు పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగ మారుస్తున్నారని సిపియం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.పుల్లయ్య అన్నారు.ప్రజా చట్ట సవరణలకు వ్వతిరేకంగా దేశ వ్యాప్త పిలుపు మేరకు “సేవ్ ఇండియా” నినాదంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట నియోజక వర్గం,అశ్వారావుపేట మండల స్తానిక తాహశీల్దార్ కార్యలయం ఎదుట ఆదివారం దర్న నిర్వహించారు.ఈసందర్బంగా పుల్లయ్య మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమ స్పూర్తితో ప్రాణలకు తెగించి సాదించుకున్న చట్టాలకు తూట్లు పొడుస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.కేంద్ర రాష్ర్ట పాలకులు కోవిడ్ – 19 ను అడ్డు పెట్టుకొని తాము చేయదలుచుకున్న సంస్కరణలను వేగవంతం చేస్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(యం) జిల్లా కమిటి సభ్యులు పిట్టల అర్జున్, చిరంజీవి, రవి ,నాగేశ్వరావు తదితరులుపాల్గోన్నారు.