భద్రాచలం పట్టణంలోని విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి.

0
TMedia (Telugu News) :

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక అధికారులకు సిపిఎం వినతి.

టీ మీడియా,డిసెంబర్,15, భద్రాచలం

భద్రాచలం పట్టణంలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని,విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సదస్సు కు హాజరైన అధికారులకు సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ కోరింది.భద్రాచలం సబ్ డివిజన్ ఆఫీస్ నందు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సి జి ఆర్ ఎఫ్) సదస్సు జరిగింది.ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలు సిజిఆర్ఎఫ్ దృష్టికి తీసుకురావాలని, బాధ్యతగా వెంటనే సమస్యలు పరిష్కరించ బడతాయని సదస్సుకు హాజరైన రాష్ట్ర అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సి జి ఆర్ ఎఫ్ అధికారుల బృందం కు కు పట్టణంలోని పలు సమస్యలను 1) ఓవర్ లోడ్ పేరుతో వేస్తున్న అధిక చార్జీలు నిలిపివేయాలని 2) పట్టణంలోని గృహ సముదాయాల పై నుండి ఉన్నటువంటి 33 కెవి లైన్ వెంటనే తొలగించి వేరే మార్గంలో వేయాలని,3)ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుగా ఉన్న పట్టణ శివారు ప్రాంతాలలో కోత్త మీటర్ల సమస్య పరిష్కరించాలని 4) పట్టణంలో అవసరమైన చోట కరెంట్ పోల్స్ వెంటనే వేయాలని 5) ప్రమాదకరంగా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ ను కట్టుదిట్టం చేయాలని 6) కరెంట్ పోల్స్ వేసి లైన్లు వేయనిచోట వెంటనే లైన్లు వేయాలని కోరడం జరిగింది.

డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని,ప్రభుత్వ పరిధిలో సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని హామీ కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రస్సెల్ ఆల్ ఫోరం (సి.జి.ఆర్.యఫ్)అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి కార్యదర్శివర్గ సభ్యులు బండారు శరత్ బాబు,పట్టణ కమిటీ సభ్యులు ఎస్ డి ఫిరోజ్ లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube