వలస ఆదివాసీలకు హక్కు పత్రాలు కల్పించాలి సిపిఎం పార్టీ డిమాండ్

0
TMedia (Telugu News) :

టి మీడియా, నవంబర్ 9, చర్ల :

చర్ల మండల కేంద్రంలో గల కామ్రేడ్ బిఎస్ రామయ్య భవన్ లో జనరల్ బాడీ వలస ఆదివాసీల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ చర్ల మండల కొండా చరణ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం వలన ఆదివాసీలను ఓబీసీ లుగా మార్చే ప్రయత్నం, వారి ఆవాసాల నుండి వెల్లగొట్టె కుట్రలు చేస్తుందని అన్నారు. వలస ఆదివాసులకు పోడు భూమి పై హక్కులు కల్పించామని అత్యంత దుర్మార్గమని, అటవీ హక్కు చట్టంలో కూడా వలస ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇవ్వద్దని లేదన్నారు. టిఆర్ఎస్ గిరిజన మంత్రులు వీరిని ఎస్టి గిరిజనులు కాదని అనడం, దీనికి అనుగుణంగా స్థానిక రెవెన్యూ వారు సర్టిఫికెట్లు జారీ చేయకపోవడం, ఉన్న వాటిని రద్దు చేయడం సరికాదన్నారు. చతిస్గడ్ రాష్ట్రంలో 1950 షెడ్యూల్ ట్రైబల్ గెజిట్లో సెక్షన్ నెంబర్ 16 కేంద్ర వలస ఆదివాసీలు ఎస్టి హోదా కలిగి ఉన్నారని, తెలంగాణలో కూడా సెక్షన్ నెంబర్ 18 లో షెడ్యూలు ట్రైబల్ గెజిట్ ఉందన్నారు.

ఈ వలస ఆదివాసులకు భూమిపై పోరాటం హక్కు కల్పించకపోతే రాజ్యాంగం తలదన్నినట్లే అవుతుందన్నారు. తక్షణమే వారికి కులము, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని ఎఫ్ ఆర్ సి కమిటీల వారితోనే వారి గ్రామాలలో వేయాలని, వరి సాగు చేసుకున్న ప్రతి పోడు భూమికి, ప్రతి వలస ఆదివాసికి హక్కు పత్రాలు ఇవ్వాలని అన్నారు. దశల వారీగా మూడుసార్లు మూడు నెలలకు ఒక దశగా పత్రాలు సేకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కారం నరేష్, మచ్చా రామారావు, శ్యామల వెంకట్, సుబ్బంపేట సర్పంచ్ యూకా సుజాత, పాముల సాంబ, నల్లగట్ల మూర్తి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube