ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ త్రీపాటి కి వినతి పత్రాన్ని ఇచ్చిన సీపీఎం జిల్లా నాయకులు గ్యానం వాసు

0
TMedia (Telugu News) :

టి మీడియా ,నవంబర్ 16 : వెంకటాపురం

ములుగు జిల్లా వెంకటాపురంలోని ఎదిర గ్రామ ఆదివాసీలు తాము దశాబ్దకాలంగా నివాసముంటున్న స్థలాన్ని ఖాళీ చేయాలని, మెగా పల్లె ప్రకృతి వనాలు నిర్మిస్తామని అధికారులు ఖాళీ చేయమంటున్నారని సిపిఎం నేతలు జి వాసు,చారి అధ్వర్యంలో సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మెగా నిర్మాణ పనులకు అడ్డు రాకూడదని ఆయా స్థలాల విస్తీర్ణాన్ని తగ్గించి ఇళ్ళు కోల్పోకుండా న్యాయం చేస్తానని అందుకు అనుగుణంగా అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు . మండలంలో వందల సంఖ్యలో రైతుల భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయలేదని, పెండింగ్ పాసు పుస్తకాల సమస్యను పరిష్కరించి, రైతుబంధు సహాయం అందే విధంగా గా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గ్యానం వాసు, కట్ల చారి, పండా శ్రీను గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

The CPM district leaders who handed over the petition were Gyanam vasu.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube