టి మీడియా, అక్టోబర్, 29, భద్రాచలం
భద్రాచలం పట్టణంలో శనివారం సిపిఎం పట్టణ ఏడవ మహాసభ నిర్వహించనున్నారు.ఈ క్రమంలో మహాసభల ఏర్పాట్లు పూర్తి చేశారు. అమరవీరులు ఏజెన్సీ ముద్దుబిడ్డలు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యేలు కుంజా బోజ్జి,సున్నం రాజయ్య నగర్ నందు పార్టీ పట్టణ కమిటీ సభ్యులు అయితంరాజు రాజు కొండలరావు ప్రాంగణం (రాజుల సత్రం) లో ఈ మహా సభ జరుగుతుందని పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి తెలిపారు.
ఈ మహాసభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావు, కామ్రేడ్ పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి అన్నవరం కన్నయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే. రమేష్, పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎలమంచిలి రవి కుమార్ లు పాల్గొంటారని పేర్కొన్నారు. మూడేళ్లకు ఒకసారి జరిగే ఈ మహాసభలో పార్టీ నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, అనుభవాలు చర్చించి, రాబోయే కాలంలో భద్రాచలం పట్టణంలోని సమస్యలపై ప్రజలను సమీకరించి నిర్వహించే ఉద్యమాల రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు.
ఈ మహాసభకు సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు, శాఖ సభ్యులు, సభ్యులు హాజరు కావాలని ఆయన తెలిపారు.