సిపిఎం పార్టీ 8 వ మండల మహాసభ

0
TMedia (Telugu News) :

టీ మిడియా, నవంబర్ 19, వెంకటాపురం:

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ 8 వ మహాసభలు మండల కమిటీ ఎన్నిక సందర్భంగా గ్యానం వాసు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సిపిఎం పార్టీ సభ్యులు సుడి కృష్ణారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం 19 మందితో మండల కమిటీ ఎన్నిక నిర్వహించారు. దీనిలో మండల కమిటీ కార్యదర్శిగా కుమ్మరి శీనును నియమించారు. కార్యదర్శి వర్గంగా గ్యానం వాసు, వంకా రాములు, కట్ల చారి, చిట్టెం ఆదినారాయణ, దామోదర్ ను ఎన్నుకొన్నారు.

ఈ మహాసభలో భవిష్యత్తులో సిపిఎం పార్టీ మండల కమిటీని ముందుకు తీసుకెల్లడానికి నూతన కమిటీని ఎన్నుకొన్నారు. ఆదివాసి గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇప్పించడానికి, దళితులకు డబుల్ బెడ్ రూములు, పాలెం ప్రాజెక్టు కుడి కాలువ ఎగువ వరకు నీళ్లు వేళ్లడానికి, వెంకటాపురంలో పెండింగ్ ఉన్న ఫైర్ స్టేషన్ను, ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని, దగ్గరలో ఉన్న చల్ల వాగు చెక్ డ్యాం నిధులు ఇవ్వాలని, గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించడానికి కృషి చేయాలని సిపిఎం పార్టీ మహాజన సభలో తీర్మానం చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, డాక్టర్ మీడియం బాబురావు, సుడి కృష్ణారెడ్డి, జ్ఞానం వాసు, కుమ్మరి శ్రీను, వంకా రాములు, రౌతు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.

CPM Party 8th constituency
CPM Party 8th constituency congress.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube