సీపీఎం పార్టీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభం
సీపీఎం పార్టీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభం
సీపీఎం పార్టీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభం
టీ మీడియా, జులై 2, గోదావరిఖని :
పెద్దపల్లి జిల్లా సీపీఎం పార్టీ సభ్యులకు,శ్రామిక భవన్, గోదావరిఖని కేంద్రంగా శనివారం క్లాసులు ప్రారంభం అయ్యాయి.
ఈ సందర్బంగా ముఖ్యఅతిథిగా సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు కామ్రేడ్ భూపాల్ మాట్లాడుతూ… పార్టీ అంతర్గత సభ్యుల సైద్ధాంతిక నాణ్యత పెంచడానికి,ప్రస్తుత దేశ,రాష్ట్ర రాజకీయ పరిస్థితులు,పాలక వర్గాల పోకడలు, సమాజంలో పెచురిల్లుతున్న దోపిడీ,మతోన్మాదం,
కులం,మతం పేరున జరిగే అస్తిత్వ రాజకీయ విధానాలు తదితర అంశాలపై చర్చిండం జరుగుతుందని అన్నారు.ఈ సందర్బంగా ప్రజా వ్యతిరేక విధానాలపై కమ్యూనిస్టుల పని విధానం ఎలా ఉండాలి,పార్టీ సభ్యులు అనుసరించాల్సిన సైద్ధాంతిక ప్రత్యామ్నాయ పద్ధతులు,భవిష్యత్ కర్తవ్యాలను ఈ శిక్షణ తరగుతలలో రూపొందించుకోవడం జరుగుతుంది అన్నారు.
Also Read : రాకపోకలకు ..ఇక తాత్కాలిక బ్రిడ్జి
ఈకార్యక్రమంలో శిక్షణా తరగతులకు ప్రిన్సిపాల్ గా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి వ్యవహరించగా
జిల్లా కార్యదర్శి వై.యాకయ్య,
జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యంరావు,ఎం.మహేశ్వరి,ఎం.రామాచారి,
జిల్లా కమిటీ సభ్యులు
జి. జ్యోతి,బత్తిని సంతోష్, సిపెళ్లి రవీందర్,లావణ్య,డి. కొమురయ్య,
ఎన్.శంకర్,ఎం.సారయ్య,
సభ్యులు ఎన్. నర్సయ్య,సి హెచ్.శైలజ,
లక్ష్మారెడ్డి,భిక్షపతి,రమణ,ప్రశాంత్,రాజయ్య, సంతోష్, ఉపేందర్,లలిత,వెంకటస్వామి, శ్రీను,కొమురయ్య, నాగలక్ష్మి,కార్తిక్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.