కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ

-సిపిఎం నిరసన ధర్నా

0
TMedia (Telugu News) :

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ

-సిపిఎం నిరసన ధర్నా

టీ మీడియా, ఫిబ్రవరి 24,విజయవాడ : ప్రజల సంపదను అదానీకి దోచిపెడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ . శుక్రవారం ఉదయం సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ వద్ద నేతలు, కార్యకర్తలు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ … ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామన్నారు. సబ్సిడీ కోతలు, ఉపాధి కల్పించని కేటాయింపులు, సంక్షేమం కుదించే చర్యలు, ప్రభుత్వ రంగంలో వాటాల అమ్మకాలకు నిరసనగా ఈ ధర్నా నిర్వహించామని పేర్కొన్నారు.

Also Read : వైద్య విద్యార్థిని ప్రీతికి వేధింపులు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube