-సిపిఎం మండల కార్యదర్శి కాంతారావు
టీ మీడియా,డిసెంబర్9,కరకగూడెం:
కరకగూడెం మండల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. కరోనా నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనేక సందేహాలు నేపథ్యంలో ప్రభుత్వ హాస్టల్లో పారిశుద్ధ్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అట్లాగే నోట్ పుస్తకాలు మెడికల్ కిట్లు తక్షణమే సరఫరా చేయాలని అధికారులు వెను వెంటనే విజిట్ చేసి సిబ్బందిని అప్రమత్తం చేయాలని నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని తెలియజేశారు.