శివలింగంపై పీతలను సమర్పించే ఏకైక శివాలయం

శివలింగంపై పీతలను సమర్పించే ఏకైక శివాలయం

0
TMedia (Telugu News) :

శివలింగంపై పీతలను సమర్పించే ఏకైక శివాలయం..

లహరి, జనవరి 19, సూరత్‌ : శివుడు అభిషేక ప్రియుడు, కాసిన నీళ్లు పోసినా..ఓ పత్రంతో పూజించినా కరుణించే దేవుడు. అటువంటి శివుడు ఓ ప్రాంతంలో వింత అభిషేకలు అందుకుంటున్నాడు. గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని రుంద్‌నాథ్‌ మహదేవ్‌ ఆలయంలో కొలువైన శివయ్యకు మాత్రం విచిత్రంగా పీతలతో అభిషేకం చేస్తారు.

ఆ పీతలనే స్వామివారికి నైవేద్యంగా పెడతారు.సూరత్‌లోని రుంద్‌నాథ్‌ మహదేవ్‌ ఆలయంలో స్వామివారికి దర్శించుకోవటానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. రామ్‌నాథ్‌ ఘేలా శ్మశాన వాటికలో ఉన్న ఈ ఆలయంలో ఏడాదికోసారి మాఘమాస ఏకాదశి రోజున పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. అలా కోరుకుంటూ బతికున్న పీతలను తీసుకొచ్చివాటితో శివుడికి అభిషేకం చేస్తుంటారు.ఇలా పీతలతో అభిషేకం,పూజలు చేయడం వల్ల శారీరక రుగ్మతలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు.

Also Read : నాటుతుపాకీ పేలి వ్యక్తి మృతి

ముఖ్యంగా వైకల్యాలు ఉన్నవారు ఈ దేవదేవడిని దర్శించుకుని పీతలో అభిషేకిస్తే ఆ సమస్యలు తొలగిపోతాయన నమ్మకం.చెవుడు వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయని నమ్ముతారట. స్వామికి పూజలు చేసిన తరువాత భక్తులు అక్కడి శ్మశానంలోని వారి వారి బంధువుల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.ఇక ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల చేతుల్లో వేరే ప్రసాదాలేవీ కనిపించవు. ప్రతి ఒక్కరి చేతిలో ఖచ్చితంగా పీతులుంటాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube