కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి
టీ మీడియా, జనవరి 18, టెక్సాస్ : నేపాల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన మరవకముందే.. అమెరికాలోని టెక్సాస్‌లో ఓ చిన్న సైజు విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. విక్టోరియా యోకుమ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో ఐదుగురు ఉన్నట్లు తెలిపారు. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఒకరికి తీవ్రంగా గాయాలైనట్లు చెప్పారు. మృతులు బిల్ గార్నర్, స్టీవ్ టక్కర్, టైలర్ ప్యాటర్సన్, టైలర్ స్ప్రంగర్లుగా గుర్తించారు.
Also Read : 6.1 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ప్రమాదంలో గాయపడిన పాస్టర్ కెన్నన్ వాఘన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా జర్మన్టౌన్లోని మెంఫిస్ శివారులోని ఓ చర్చికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube