కూలిన శిక్ష‌ణ విమానం : మ‌హిళా పైలట్‌కు గాయాలు

కూలిన శిక్ష‌ణ విమానం : మ‌హిళా పైలట్‌కు గాయాలు

1
TMedia (Telugu News) :

కూలిన శిక్ష‌ణ విమానం : మ‌హిళా పైలట్‌కు గాయాలు
టి మీడియా,జూలై25,ముంబై : మ‌హారాష్ట్ర‌లోని పుణే స‌మీపంలో క‌ద‌బ‌న్‌వాడీ వ‌ద్ద పంట పొలంలో సోమ‌వారం శిక్ష‌ణ విమానం కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో మ‌హిళా పైల‌ట్ (22)కు గాయాల‌య్యాయ‌ని అధికారులు తెలిపారు. ఈ విమానం పైల‌ట్ల‌కు శిక్ష‌ణ ఇచ్చే కార్వ‌ర్ ఏవియేష‌న్ కంపెనీకి చెందిన‌ద‌ని పుణే ఎస్‌పీ అభిన‌వ్ దేశ్‌ముఖ్ చెప్పారు.

 

Also Read : శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో ట్రైనీ పైల‌ట్ భ‌విక రాథోడ్ విమానాన్ని అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌కు ప్ర‌య‌త్నిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌నలో స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన పైల‌ట్‌ను న‌వ్‌జీవ‌న్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. సోమ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని అధికారులు వెల్ల‌డించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube