నిందితులను కఠినంగా శిక్షించాలి

నిందితులను కఠినంగా శిక్షించాలి

1
TMedia (Telugu News) :

నిందితులను కఠినంగా శిక్షించాలి

టీ మీడియా, మార్చి 14, వనపర్తి : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల తాసిల్దార్ కార్యాలయంలో నైట్ డ్యూటీ చేస్తున్న కొత్తపల్లి గ్రామం విఆర్ఏ దుర్గం రాజును గుర్తుతెలియని దుండగులు హత్య చేయడం జరిగింది. మళ్లీ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ విధులను బహిష్కరించి నిరసన తెలిపిన విఆర్ఏలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా తోటి వీఆర్ఏ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వపరంగా కుటుంబాన్ని ఆదుకోవాలని అదేవిధంగా 2013లో నైట్ డ్యూటీల విషయంలో సంబంధిత జీ.వో కాపీతో కూడిన వినతిపత్రాన్ని సోమవారం వనపర్తి తాసిల్దార్ రాజేందర్ గౌడ్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల గౌరవ అధ్యక్షుడు పుట్టా ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు తిరుపతయ్య, సురేష్ ,భాగ్యమ్మ, లక్ష్మి, కృష్ణవేణి ,శివమ్మ, నాగలక్ష్మి, రాధా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Also Read : వీరమాచినేని కి కు కాంగ్రెస్ నివాళి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube