రాహుల్‌ గాంధీ విమర్శలు

రాహుల్‌ గాంధీ విమర్శలు

0
TMedia (Telugu News) :

రాహుల్‌ గాంధీ విమర్శలు

టీ మీడియా, ఫిబ్రవరి 23,షిల్లాంగ్‌ : ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి తీసుకువచ్చేందుకే తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) ఇక్కడ పోటీ చేస్తోందని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ బుధవారం విమర్శించారు. షిల్లాంగ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ బిజెపి, టిఎంసిలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. తమకు అన్నీ తెలుసునని భావించే బిజెపి ఎవ్వరినీ గౌరవించదని అన్నారు. ‘బిజెపి,ఆర్‌ఎస్‌స్‌లు తమకు అన్ని తెలుసునని, అన్నీ అర్థం చేసుకుంటామని భావిస్తుంటాయి. కానీ, ఎవ్వరికీ గౌరవం ఇవ్వవు. మనమందరం వాటికి వ్యతిరేకంగా పోరాడాలి. తమ సొంత సిద్ధాంతాలతో దేశంలోని వ్యవస్థలపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులకు పాల్పడుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక, జమ్ముకాశ్మీర్‌, హర్యానా ఇలా ప్రతి రాష్ట్రంలోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులకు తెగబడుతోంది. ఒకే సిద్ధాంతాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటు, మీడియా, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ.. ఇలా అన్ని వ్యవస్థలూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి’

Also Read : ‘పిడుగుల పరమేశ్వరుడి’ ఆలయం విశిష్టత..

రాహుల్‌ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో హింస, కుంభకోణాల చరిత్ర కలిగిన పార్టీ టిఎంసి అని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. గోవా ఎన్నికల కోసం టిఎంసి భారీగా ఖర్చుచేసిందని.. అది కూడా బిజెపికి ప్రయోజనం చేకూర్చేందుకేనని ఆరోపించారు. తాజాగా మేఘాలయాలోనూ అదే విధంగా టిఎంసి వ్యవహరిస్తోందని.. తద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి తీసుకువచ్చేందుకు దోహదం చేస్తుందన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube