సర్వైర్ సారు గిదెంది

తహసీల్దార్ కార్యాలయం టేబుల్ పై కాళ్ళు

1
TMedia (Telugu News) :

సర్వైర్ సారు గిదెంది

తహసీల్దార్ కార్యాలయం టేబుల్ పై కాళ్ళు
టీ మీడియా,సెప్టెంబర్ 21,వినుకొండ : సామాన్య మానవుడు కైనా ప్రభుత్వం ఉద్యోగం అంటే ఎంతో ప్రేమ,టైమ్ ప్రకారం విధి నిర్వహణ,నెల ఫస్ట్ కాగానే ఏకౌంట్ లో జీతం ఇంత కంటే మానవుడికి ఏమి కావాలి, ఉన్నతచదువులు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు చాలా మంది ఉన్నారు…కాని ప్రభుత్వ ఉద్యోగం అందరినీ వరించదు, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వారు విధి నిర్వహణలో,కార్యాలయాల్లో వారి ప్రవర్తన హుందాగా ఉండాలి, కాని నూజండ్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ గా డిప్యూటేషన్ పై మాచర్ల నియోజకవర్గం దుర్గి నుంచి వచ్చి ఇక్కడ నెల రోజులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సర్వేయర్ తను విధులు నిర్వహించే గదిలో రికార్డులు ఉంచే టేబుల్ పై కాళ్లు పెట్టి విధులు నిర్వహిస్తుండటంతో అతని తీరుపట్ల మండలం నుంచి పని కోసం ఆఫీసు కు వచ్చే ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

Also Read : మూడో డోస్ తప్పనిసరి

నిన్న తహసీల్దార్ కార్యాలయంనకు ప్రజలు అతని గది వద్దకు పనులు నిమిత్తం వచ్చినా తను మాత్రం టేబుల్ పై నుంచి కాళ్లు తీయకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రజలువస్తున్నారనే కనీస మర్యాద కూడా లేదని అంటున్నారు.ఈ సంఘటన పై సర్వేయర్ ను వివరణ అడగ్గా అనారోగ్య కారణంగా కాళ్లు టేబుల్ మీద పెట్టుకున్నానని అందులో తప్పు ఏముందంటూ సమాధానం చెబుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube