తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

31 కంపార్ట్మెంట్లలో భక్తులు

1
TMedia (Telugu News) :

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
-31 కంపార్ట్మెంట్లలో భక్తులు

-దర్శనానికి 10 గంటల సమయం
టి మీడియా,జూలై 13తిరుపతి : కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆషాడం మాసంలోని తొలి ఏకాదశి, గురు పౌర్ణమి వంటి వేడుకలు రావడంతో.. స్వామివారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుపతి కొండపైకి చేరుకున్నారు. వేంకటనాథుడిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. దీంతో శ్రీవారి భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు మొత్తం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

 

Also Read : సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ

స్వామివారి దర్శనానికి 10 గంటలు పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.శ్రీవారిని మంగళవారం 74,212 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 5.05 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని.. మొత్తం 33,215 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ వర్గాలు చెప్పాయి.మరోవైపు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌ని పేర్కొన్నారు. రెండేళ్ల త‌రువాత మాడ వీధుల్లో బ్ర‌హ్మోత్స‌వాల‌ వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హించి భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని చెప్పిన సంగతి తెలిసిందే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube