ఎన్నికల సంఘం నియమావళి ప్రకారమే ఓట్లు నమోదు

ఎన్నికల సంఘం నియమావళి ప్రకారమే ఓట్లు నమోదు

1
TMedia (Telugu News) :

 

ఎన్నికల సంఘం నియమావళి ప్రకారమే
ఓట్లు నమోదు

•- రాజకీయ ప్రయోజనాల కోసమే మంత్రి
పువ్వాడ అజయ్ పై అసత్య ప్రచారం

•- ఆధారాలతో సహా తేల్చి చెప్పిన
కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంతలక్ష్మి

•- ఓట్ల నమోదుపై విషయ పరిజ్ఞానం
లేక విషం చిమ్ముతున్నారు

•- మతిలేని ఆరోపణలతో ఢీ కొట్టలేరు

ఖమ్మం నగరంలో కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై అసత్య ఆరోపణలు, నిరాధారమైన ప్రచారాలు చేస్తున్నారని నగర 20వ డివిజన్ కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంతలక్ష్మి ఆరోపించారు. ఈ మేరకు 20వ డివిజన్ మమత కళాశాల పరిధిలో ఓట్లకు సంబంధించి వివరణ ఇచ్చారు. మమత కళాశాల విద్యార్థుల ఓట్లపై కొందరు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను స్పష్టమైన ఆధారాలతో ఆమె తిప్పికొట్టారు.

మమత వైద్య కళాశాలలో విద్యను అభ్యసించేందుకు ఇతర ప్రాంతాల నుంచి వేల మంది విద్యార్థులు ఖమ్మం నగరానికి వలస వచ్చి హాస్టల్ లో అద్దె గదుల్లో నివాసం ఉంటారని అందువల్ల భారత రాజ్యాంగం వారికి కల్పించిన ప్రాథమిక హక్కైన ఓటును విద్యార్థులు స్వతహాగా మమత కళాశాల పరిధిలోని పోలింగ్ బూతు లోనే ఓటు హక్కును నమోదు చేసుకున్నారని తెలిపారు.

భారత ఎన్నికల సంఘం విద్య కోసం ఇతర పట్టణాలు మరియు నగరాలకు వలస వెళ్ళే 18 ఏళ్లు పైబడిన విద్యార్థులు తమ విద్యా సంస్థల ద్వారా స్థానికంగా ఎన్నికల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి అనుమతించిందని పేర్కొన్నారు. దీని ప్రకారమే మమత కళాశాల విద్యార్థుల తమ ఓట్లను నమోదు చేసుకున్నారని స్పష్టం చేశారు.

నాడు 2007లో ఎలక్షన్ కమిషన్ విద్యార్థులకు ఓట్లు నమోదుకు అనుమతించిన నాటి నుండి మమత విద్యార్థులు ఓట్లు నమోదు చేసుకుంటున్నారని ఒకసారి తమ విద్యనభ్యసించిన తరువాత చదువు పూర్తై వారు క్యాంపస్‌ను విడిచిపెట్టిన వెంటనే వారి ఓట్లు తొలగిస్తున్నారని వివరించారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరంలో నివాసం ఉండేది మమత కళాశాల ప్రాంగణంలోనే అని అది మమత కళాశాల నంబర్ 5-7-200 పరిధిలోకి వస్తుందని అన్నారు అంతే కానీ మంత్రి అజయ్ ఇంటి నంబర్ పైన వందల ఓట్లు అనేది అవాస్తవామని తేల్చి చెప్పారు.

ఇది భారత ఎన్నికల సంఘం నియమావళి అనుగుణంగా జరిగిన ప్రక్రియ అని తేల్చిచెప్పారు. ఎప్పుడూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై బురద జల్లే ప్రయత్నం చేసే కొందరు అజ్ఞానులు కనీసం రాజకీయ పరిజ్ఞానం లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం విడ్డూరమని, మతిలేని ఆరోపణలతో మంత్రిని ఢీ కొట్టలేరని అన్నారు. ఎన్నికల సంఘం నియమావళిను అందుకు సంబంధించిన కాపీలను విడుదల చేశారు.

విద్యార్థులకు భారత ఎన్నికల సంఘం ఓటు హక్కు నమోదుకు అనుమతించిన విషయంపై సరైన అవగాహన, విషయ పరిజ్ఞానం లేక కొందరు మమత కళాశాలపై, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పైన దొంగ ఓట్లుగా చిత్రీకరిస్తూ విషం చిమ్ముతున్నారని కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంతలక్ష్మి మండిపడ్డారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube