క్రిప్టో కరెన్సీ జూదంలాంటిదే.. వీటిని నిషేధించాలి

ఆర్బీఐ గవర్నర్‌

0
TMedia (Telugu News) :

క్రిప్టో కరెన్సీ జూదంలాంటిదే.. వీటిని నిషేధించాలి

– ఆర్బీఐ గవర్నర్‌

టీ మీడియా, జనవరి 14, న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీపై తన అభిప్రాయాన్ని మరోసారి వెల్లడించారు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌. వీటిని నిషేధించాల్సిందే అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీ జస్ట్‌ జూదంలాంటిదని, వాటికి ఎలాంటి విలువ లేదని చెప్పారు. అయితే, వాటికి విలువ ఉన్నట్లుగా నమ్మిస్తున్నారని చెప్పారు. క్రిప్టో కరెన్సీ అంతా బూటకమన్నారు. శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతూ క్రిప్టోను నిషేధించాలని పిలుపునిచ్చారు. ఏ ఆస్తికైనా, ఆర్థిక ఉత్పత్తికైనా అంతర్గత విలువ అనేది ఒకటి ఉండాలని, కానీ క్రిప్టోల విషయంలో అలాంటి విలువ ఏదీ లేదని, వీటి విలువ అంతా అభూత కల్పనే అని చెప్పారు. మన దేశంలో జూదం అడటానికి అనుమతి లేదని, జూదాన్ని అనుమతించాలనుకుంటే క్రిప్టోలను జూదంగా పరిగణించాలన్నారు. ధనం పేరుతో జూదం ఆడటాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు.

Also Read : శివాలయం ధ్వజస్తంభం ప్రతిష్ట ఘనంగా నిర్వహించాలి

క్రిప్టోకరెన్సీల వృద్ధిని ఎదుర్కొనేందుకు సెంట్రల్ బ్యాంక్ ఇటీవల తన ఈ-రూపాయి లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ని పైలట్ మోడ్‌లో ప్రారంభించింది. ఈ సీబీడీసీ అనేది డబ్బు భవిష్యత్‌ అని, దానిని స్వీకరించడం లాజిస్టిక్స్‌, ప్రింటింగ్‌ ఖర్చులను ఆదా చేయడంలో సాయపడుతుందని శక్తికాంత దాస్‌ చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube