హ‌రికేన్ ఇయాన్.. అంధ‌కారంలో క్యూబా

హ‌రికేన్ ఇయాన్.. అంధ‌కారంలో క్యూబా

1
TMedia (Telugu News) :

హ‌రికేన్ ఇయాన్.. అంధ‌కారంలో క్యూబా

 

టీ మీడియా, సెప్టెంబర్‌ 28, హ‌వానా: హ‌రికేన్ ఇయాన్ క్యూబాలో బీభ‌త్సం సృష్టిస్తోంది. హ‌రికేన్ ధాటికి ఆ దీవులో ప‌శ్చిమ ప్రాంతం తీవ్ర ప్ర‌భావానికి లోనైంది. ఇక దేశ‌మంతా అంధ‌కారంలోకి వెళ్లిన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. హ‌రికేన్ ఇయాన్ వ‌ల్ల విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. దేశంలోని ప్ర‌ధాన విద్యుత్తు కేంద్రం హ‌రికేన్ వ‌ల్ల డౌన్ అయ్యింద‌ని, దాని పున‌రుద్ద‌ర‌ణలో ఆల‌స్యం అవుతున్న‌ట్లు అధికారులు చెప్పారు. ఇయాన్ ధాటికి ఇద్ద‌రు మృతిచెందారు. దేశ‌వ్యాప్తంగా అనేక బిల్డింగ్‌లు ధ్వంసం అయ్యాయి.

Also Read : మహేశ్‌ బాబుకు మాతృవియోగం

క్యూబా నుంచి హ‌రికేన్ ఇప్పుడు అమెరికా దిశ‌గా వెళ్తోంది. ఇప్ప‌టికే ఫ్లోరిడాలో 195 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. క్యూబాలో విద్యుత్త స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డ‌డం వ‌ల్ల 11 మిలియ‌న్ల మంది అంధ‌కారంలో ఉన్న‌ట్లు ఓ అధికారి తెలిపారు. రాజ‌ధాని హ‌వానాకు తూర్పు దిశ‌న వంద కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఎన‌ర్జీ ప్లాంట్ హ‌రికేన్ వ‌ల్ల ధ్వంస‌మైనట్లు తెలుస్తోంది. దాన్ని మూసివేశారంటే, ఇక దేశంలో ఎక్క‌డా విద్యుత్తు ఉత్ప‌త్తి లేన‌ట్లే అని అధికారులు చెబుతున్నారు. హ‌రికేన్ ఇయాన్ వ‌ల్ల పొగాకు తోటలు కూడా భారీగా ధ్వంసం అయ్యాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube