నిద్రించే స్థలంలో వీటిని ఉంచకూడదు.. ఉంచితే..
లహరి, ఫిబ్రవరి 27, కల్చరల్ : చాలా మంది తమ ఇంటిని ఎంతో అందంగా నిర్మించుకుంటారు. ఆ ఇంట్లో ఆనందం, సంతోషంగా జీవించాలి కూడా కలలు కంటుంటారు. కానీ వారి జీవితాలలో మనశ్శాంతి, ప్రశాంతత ఉండదు. అందుకు వారు నిర్మించిన ఇంటిలో వాస్తు లోపాలు, దోషాలు ఉండడమే ప్రధాన కారణమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాక వాస్తు ప్రకారం కొన్ని కొన్ని వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. పెడితే ఆ ఇళ్లు దరిద్ర దేవతకు నిలయం అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పొరపాటున కూడా మంచం క్రింద, నిద్రించే ప్రదేశంలో కొన్ని రకాల వస్తువులను ఉంచకూడదు. లేదంటే జీవితాంతం కష్టాలు, ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. వాస్తు ప్రకారం పనులు జరిగితే చాలా పనులు సులువుగా జరుగుతాయి. మరి ఏయే వస్తువులను మంచం లేదా నిద్రించే ప్రదేశంలో ఉంచకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చీపురు: మంచం లేదా నిద్రించే ప్రదేశంలో చీపురు ఉంచడం చాలా అశుభం. మనస్సు, మెదడుపై చీపురు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంతేకాకుండా ఇంట్లో ఆర్థిక అడ్డంకులు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అదే సమయంలో కుటుంబ సభ్యులు అనారోగ్యానికి కూడా గురవుతారు.
Also Read : శ్రీకృష్ణ ఆలయంలో భగవంతుని సేవకు రోబోటిక్ ఏనుగు
తుప్పు పట్టిన ఇనుము, ప్లాస్టిక్: వాస్తు శాస్త్రం ప్రకారం మీరు నిద్రించే ప్రదేశంలో తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులను ఉంచవద్దు. దీని కారణంగా ఇంట్లో భయంకరమైన వాస్తు లోపం తలెత్తి ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుంది.
బూట్లు, చెప్పులు: బంగారు-వెండి లేదా ఇతర లోహపు నగలు, అద్దం, బూట్లు, చెప్పులు వంటివాటిని మంచం కింద ఉంచవద్దు. వీటి వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే పొరపాటున కూడా మంచం కింద గాజు లేదా నూనె ఉంచవద్దు. ఎందుకంటే ఇవి వాస్తు శాస్త్రం ప్రకారం ఆ ప్రదేశంలో ఉంటే కుటుంబానికి హానికరం.
ఎలక్ట్రానిక్ వస్తువులు: వాస్తు శాస్త్రం ప్రకారం మంచం కింద ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంచకూడదు. దీని వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు నిద్ర రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube