జీవితాన్ని సర్వనాశనం చేసే చెడు అలవాట్లివే..

జీవితాన్ని సర్వనాశనం చేసే చెడు అలవాట్లివే..

0
TMedia (Telugu News) :

జీవితాన్ని సర్వనాశనం చేసే చెడు అలవాట్లివే..

లహరి, మార్చి2, కల్చరల్ : దృతరాష్ట్రుని సోదరుడు, కురు సామ్రాజ్య ప్రధాన మంత్రి విదురుడు. సునిశిత ఆలోచనా ధోరణి, దార్శనికత కలిగిన గొప్ప మేధావి ఆయన. సరళమైన ప్రశాంత చిత్తం కలిగిన స్థిత ప్రజ్ఙత కలిగిన రాజకీయవేత్త కూడా. కృష్ణ భగవానుడికి కూడా అత్యంత ప్రీతి పాత్రుడైన విదురుడిని సంప్రదించకుండా కురు మహా రాజు దృతరాష్ట్రుడు ఎలాంటి నిర్ణయాలు చేసేవాడు కాదు. అలా ఆ క్రమంలో వారిద్దరి మధ్య సాగిన సంభాషణలే విదుర నీతిగా ప్రాచూర్యంలో ఉన్నాయి. అనేక జీవిత సత్యాలను విదురుడు దృతరాష్ట్రుడికి చెప్పినట్టుగా ప్రపంచానికి మార్గదర్శనం చేశాడు. అందులో భాగంగా జీవన విధానం, ధనం, కర్మ వంటి అనేకానేక విషయాల గురించిన వివరణలు ఇచ్చాడు. విదుర నీతిలో సంతోషకరమైన జీవితం కోసం ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలో కూడా వివరించాడు. విదురుడు చెప్పిన జీవిత సత్యాలు ఎప్పుడూ ఆచరణీయాలే. కాబట్టి వాటిని వెంటనే విడిచిపెట్టాలి. లేకపోతే జీవితంలో ఎంతో కోల్పోయి దృతరాష్ట్రుడిలా విచారించక తప్పదని చెబుతోంది విదుర నీతి. మరి తప్పక విడిచి పెట్టవలసిన చెడు లక్షణాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read : ఆన్‌లైన్‌లోకి వచ్చేసిన శ్రీరామనవమి కల్యాణ టికెట్లు

ఎలాంటి స్థితిలోనూ గర్వం పనికిరాదు. తనను తాను ఇతరులకంటే ఎక్కువగా భావించే వ్యక్తి అహంకారి. అలాంటి వ్యక్తులు సాధారణంగా ఎవరికీ నచ్చరు. అందుకే అహంకారానికి దూరంగా ఉండాలి.
తక్కువ మాట్లాడడం ఎప్పుడూ శ్రేయస్కరం. ఎక్కువ మాట్లాడడం వల్ల తెలిసో తెలియకో తప్పులు మాట్లాడే ప్రమాదం ఉంటుంది. అందుకే అవసరానికి మించి మాట్లాడక పోవడమే మంచిది. ఈ లక్షణం మిమ్మల్ని వివాద రహితులుగా చేస్తుంది. అందుకే అతిగా మాట్లాడటం అనర్థదాయకం అని విదురనీతి సారాంశం.
అతిగా లేదా తరచుగా కోపం తెచ్చుకోవడం అంత మంచిది కాదు. కోపంలో మాట్లాడే మాటలకు, చేతలకు ఇతరులే కాదు స్వయంగా వారికి కూడా నష్టం జరగవచ్చు. ఆగ్రహించిన వారికి ఆయుష్షు తగ్గిపోతుందని విదుర నీతి చెబుతుంది.

Also Read : వైభవంగా నరసింహ స్వామి రథోత్సవం..

నమ్మిన వారిని మోసం చెయ్యడం ఎప్పుడూ మంచిది కాదు. నమ్మిన వారికి ద్రోహం చెయ్యడం వల్ల మీకు మరే హాని చేసుకున్నట్టు అది మిమ్మల్నే నాశనం చేస్తుంది. నమ్మక ద్రోహం మొదటికే మోసం అని విదుర నీతి వివరిస్తుంది.
ఆశ అందలాన్ని అందుకునే బలాన్ని ఇస్తే అత్యాశ అధఃపాతాళానికి తోసేస్తుంది. దురాశ దుఃఖానికి చేటవుతుందని విదుర నీతి చెబుతోంది. అతిగా ఆశ పడే వ్యక్తి ఎప్పుడూ ఆనందంగా ఉండలేడు. అత్యాశ పాపాలు చేయిస్తుంది. దురాశ మిమ్మల్నే నాశనం చేస్తుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube