కలలో హోలీ రంగులతో ఆడుకుంటున్నట్టు కనిపిస్తే శుభమా.. అశుభమా…!

కలలో హోలీ రంగులతో ఆడుకుంటున్నట్టు కనిపిస్తే శుభమా.. అశుభమా...!

0
TMedia (Telugu News) :

కలలో హోలీ రంగులతో ఆడుకుంటున్నట్టు కనిపిస్తే శుభమా.. అశుభమా…!

లహరి, మార్చి2, కల్చరల్ : స్వప్న శాస్త్రం ప్రకారం, మనం కలే కలలన్నింటికీ ఏదో ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే మనకొచ్చే కలల గురించి స్వప్న శాస్త్రంలో పేర్కొనబడింది. డ్రీమ్ సైన్స్ ప్రకారం, కలలు అనేవి మీ భవిష్యత్ సంఘటనల గురించి మిమ్మల్ని హెచ్చరిస్తారు. మనలో చాలా మంది పండుగ సందర్భాల్లో, ఏవేవో కలలు కంటూ ఉంటారు. ఉదాహరణకు హోలీ పండుగ వేళ అనేక మందికి రంగుల గురించి కలలొస్తుంటాయి. ఈ సందర్భంగా మీకొచ్చే కలల్లో హోలీ రంగులు కనిపించి.. మీరు ఆ రంగుల్లో తడిచి ముద్దవుతుంటే దేనికి సంకేతమో తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా హోలీ రంగులు కలలో కనిపిస్తే శుభ ఫలితాలొస్తాయి.. అశుభ ఫలితాలొస్తాయా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

Also Read : ఫోటోగ్రాఫర్‌

కలలో హోలికా దహనం చూస్తే..
స్వప్న శాస్త్రం ప్రకారం, ఎవరైతే తమకు వచ్చే కలల్లో హోలికా దహనాన్ని చూస్తారో.. అలాంటి వారికి అశుభ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే హోలికా దహనం ప్రతికూలమైనదిగా పరిగణిస్తారు. అయితే మీ ఇంటికి సంబంధించి కొన్ని శుభవార్తలు కూడా వినిపిస్తాయి. ఈ కాలంలో మీరు ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే, దానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుంది.

కలలో హోలీ ఆడుతున్నట్లు కనిపిస్తే..

మీకొచ్చే కలల్లో ఎవరైనా హోలీ ఆడుతున్నట్లు కనిపిస్తే.. స్వప్న శాస్త్రం ప్రకారం, అలాంటి కలలు శుభప్రదంగా పరిగణిస్తారు. వీటి కారణంగా మీరు భవిష్యత్తులో కొన్ని శుభవార్తలను వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అవివాహితులకు ఇలాంటి కలలొస్తే.. త్వరలోనే మంచి భాగస్వామి దక్కుతాడని అర్థం.

Also Read : వేసవిలో వేడికి చెక్ పెట్టాలంటే టమాటా తినాల్సిందే..

పింక్ కలర్ కనిపిస్తే..

సంఖ్యా శాస్త్రం ప్రకారం, మీకొచ్చే కలల్లో హోలీ రంగులతో ఆడుతున్నట్లు కనిపిస్తే దానికి వేరే అర్థాలు ఉన్నాయి. ఎవరైతే గులాబీ(Pink)రంగులతో హోలీ ఆడతున్నట్లు కల గంటారో వారికి శుభవార్తలు వినిపిస్తాయి. అదే ఎరుపు రంగుతో హోలీ ఆడటం వంటివి కనిపిస్తే మీరు జాగ్రత్తగా ఉండాలని అర్థం. లేదంటే మీరు బాగా నష్టపోవాల్సి రావొచ్చు.

కలలో ఈ రంగు కనిపిస్తే..

కలలో మీరు నలుపు రంగులతో హోలీ ఆడటం కనిపిస్తే.. అది అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు. ఆ సమయంలో మీకు కొన్ని పెద్ద ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మీకు ఎవరైనా హాని కలిగించే ప్రయత్నం చేయొచ్చు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube