డ్రైవింగ్‌ సమయంలో మెదుడు ఎలా పనిచేస్తుందంటే..?

డ్రైవింగ్‌ సమయంలో మెదుడు ఎలా పనిచేస్తుందంటే..?

0
TMedia (Telugu News) :

డ్రైవింగ్‌ సమయంలో మెదుడు ఎలా పనిచేస్తుందంటే..?

లహరి, మార్చి 10, కల్చరల్ : రోడ్డు ప్రమాదాలు జరగడానికి డ్రైవర్ల మానసిక పరిస్థితి కూడా ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక ప్రశాంతత డ్రైవింగ్‌కి చాలా అవసరం. మెదడు సూచించేవిధంగానే ఎవరైనా డ్రైవింగ్‌ చేయగలగుతారు. కళ్లు, చెవులు మెదడు ఆదేశానుసారమే పనిచేస్తాయి. మెదడులోని ఫ్రంటల్‌ లోబ్‌లు మీ వేగ సామర్థ్యాన్ని నియంత్రిస్తాయి. ఇక ప్రతిఏటా అల్జీమర్స్‌వ్యాధితో బాధపడేవారు కారు డ్రైవ్‌ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు 0.9 శాతంగా ఉందని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఇక అల్జీమర్జ్‌ వ్యాధికన్నా.. నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు ఎక్కువ. లేట్‌ నైట్స్‌లో మద్యం సేవించి డ్రైవ్‌ చేయడం, ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవ్‌ చేయడం చూస్తూనే ఉంటాం. నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా ప్రయోజనం ఉండడం లేదు.

Also Read : పసుపు రైతు పరేషాన్‌!

డ్రైవ్‌ చేయాలంటే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకుంటేనే ప్రమాదాలు జరగవని వైద్యులు సూచిస్తున్నారు.తగినంత నిద్ర, మెదుడు చురుకుగా ఉండేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలని వైద్యలు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి మందగిస్తుంటే డ్రైవింగ్‌కి దూరంగా ఉండాలని డాక్టర్లు అంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube