పెరుగు – మజ్జిగ, రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది.?
పెరుగు - మజ్జిగ, రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది.?
పెరుగు – మజ్జిగ, రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది.?
లహరి, నవంబర్ 11, కల్చరల్ : మన శరీరానికి అవసరమైన గుడ్ బ్యాక్టీరియాకు అసలైన మూలం పెరుగు, మజ్జిగే అని నిపుణులు తెలుపుతున్నారు. మన జీర్ణ వ్యవస్థను కాపాడే గట్ బ్యాక్టీరియా కోసం పెరుగు లేదా మజ్జిగతో ఆహారం తినాలని సూచిస్తున్నారు. పెరుగు, మజ్జిగ రెండూ కూడా పాల ఉత్పత్తులే. మజ్జిగ వచ్చేది కూడా పెరుగు నుంచే. అయితే, పెరుగు, మజ్జిగల్లో ఏది బెటర్ అనే సందేహం చాలామందిలో ఉంది.
పెరుగు, మజ్జిగ మధ్య తేడా ఇదే..
పెరుగు తయారు చేయడానికి, పాలను కాస్త వేడి చేసి, అందులో కొద్దిగా పెరుగు చుక్క వేసి.. సుమారు 6-8 గంటల పాటు మూత పెట్టాలి. ఇది సహజంగా పులియబెట్టే ప్రక్రియ. పెరుగు మీద మీగడ ఏర్పడుతుంది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. మజ్జిగను పెరుగుతోనే తయారు చేస్తారు. పెరుగులో నీరు పోసి చిలకడం ద్వారా అందులో నుంచి వెన్న వేరవుతుంది. వెన్న తీసిన తర్వాత మిగిలిన ద్రవాన్ని మజ్జిగ అంటారు. మజ్జిగలో ప్రోబయాటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
Also Read : టీ పదేపదే వేడి చేసి తాగుతున్నారా.?
పెరుగు, మజ్జిగలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిది.?
పెరుగు కాల్షియం లభించేందుకు మంచి సోర్స్, ఇందులో విటమిన్-బి2, విటమిన్-బి12, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇక మజ్జిగ విషయానికి వస్తే ఇందులో అధిక మొత్తంలో కాల్షియం, విటమిన్ బి12, జింక్, రిబోఫ్లావిన్, ప్రోటీన్లు ఉంటాయి. అయితే ఇది తక్కువ కేలరీలతో ఉంటుంది. వెన్న తీయడం ద్వారా కొవ్వు పదార్థాలు కూడా ఉండవు.
పెరుగు, మజ్జిగ ప్రయోజనాలు :
పెరుగు తీసుకోవడం వల్ల శరీరం అదనపు కార్టిసాల్ ఉత్పత్తి కాదు. శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ ఒత్తిడిని పెంచుతుంది. హార్మోన్ల అసమతుల్యత కార్టిసాల్ స్థాయిల పెంపుదలకు దారితీస్తుంది. ఇది అధిక రక్తపోటు, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. ఇక మజ్జిగ విషయానికి వస్తే.. ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్, క్యాన్సర్, ఒత్తిడి మొదలైన వాటి నుంచి సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Also Read : తలస్నానం చేసేప్పుడు ఆ తప్పులు చేస్తే.?
పెరుగు, మజ్జిగ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
పెరుగు కంటే మజ్జిగలో తక్కువ కొవ్వు , కేలరీలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, బరువు తగ్గాలనుకునే వారికి మజ్జిగ గొప్ప చాయిస్. నీరు జోడించడం వల్ల మజ్జిగ నుంచి వెన్న వేరవుతుంది. ఫలితంగా ఇది మధుమేహంతో బాధపడేవారికి చాలా మంచిది. పెరుగు ఊబకాయంతో బాధపడేవారు దూరంగా ఉంటే మంచిది. అయితే మజ్జిగ మాత్రం అందరికీ మంచిది. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది.