పెంచిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

పెంచిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

1
TMedia (Telugu News) :

పెంచిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి
టీ మీడియా మార్చి 31,పెద్ద శంకరంపేట:భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గురువారం రోజున శంకరంపేట మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో కు మెమోరాండం ఇవ్వడం జరిగిందని శంకరంపేట బీజేపీ మండల అధ్యక్షుడు కోణం విట్ఠల్ అన్నారు. పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలకు నిరసనగా ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి నినాదాలు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు రాబోయే కాలంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలు తీసివేయలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సాయిలు, నాగరాజు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Also Read : పోలీస్ కుటుంబానికి ఆర్థిక సాయం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube