ఆల్‌టైమ్‌ విద్యుత్‌ డిమాండ్‌

ఆల్‌టైమ్‌ విద్యుత్‌ డిమాండ్‌

2
TMedia (Telugu News) :

ఆల్‌టైమ్‌ విద్యుత్‌ డిమాండ్‌
టీ మీడియా, మార్చ్ 29 హైదరాబాద్: అత్యధిక విద్యుత్ డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ విద్యుత్ డిమాండ్ 14 వేల మార్క్‌ను దాటింది. ఏకంగా 14,117 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ సాయంత్రం వరకు మరింత పెరిగే అవకాశముంది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 13,162 మెగా వాట్లు మాత్రమే విద్యుత్ వినియోగం జరిగింది. సౌత్ ఇండియాలో అత్యధిక విద్యుత్ వినియోగంలో మొదటి స్థానంలో తమిళనాడు ఉండగా.. తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. అయితే 18వేల మెగా వాట్ల విద్యుత్ వినియోగం డిమాండ్ వచ్చినా.. సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని టాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.

Also Read : ఎమ్మెల్యే తమ్ముడికి దళితబంధు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube