కరెంట్‌ షాక్‌తో ముగ్గురు రైతులు మృతి

కరెంట్‌ షాక్‌తో ముగ్గురు రైతులు మృతి

1
TMedia (Telugu News) :

కరెంట్‌ షాక్‌తో ముగ్గురు రైతులు మృతి

టీ మీడియా, అక్టోబర్ 28, కడప జిల్లా : ఏపీలోని వైఎస్సార్‌ కడప జిల్లాలో ఘోరం జరిగింది. జిల్లాలోని చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో పొలంలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా ముగ్గురు రైతులు కరెంట్‌ షాక్‌తో మృతి చెందారు. ముందుగా ఒక రైతు పిచికారి చేస్తుండగా అతడికి కరెంట్‌ షాక్ తగిలింది. అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరికి కూడా షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.

Also Read : వైస్ చైర్మన్ ను పరామర్శించిన నాయకులు

ముగ్గురు మరణంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube