ఎలాంటి పర్మిషన్ లేకుండా తాటి చెట్ల నరికివేత

పట్టించుకోని ఎక్సైజ్ అధికార యంత్రాంగం

0
TMedia (Telugu News) :

ఎలాంటి పర్మిషన్ లేకుండా తాటి చెట్ల నరికివేత

– పట్టించుకోని ఎక్సైజ్ అధికార యంత్రాంగం

టీ మీడియా, జనవరి 13, తిరుమలాయపాలెం : తిరుమలాయపాలెం మండల పరిధిలోని జూపెడ రెవెన్యూ గ్రామ పరిధిలో గల వ్యవసాయ క్షేత్రంలో భూ యజమాని ఎక్సైజ్ శాఖ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వ్యవసాయ భూమికి రోడ్డు పక్కన ఉన్న సుమారు 30 తాటి చెట్లను ప్రోక్లైన్ యంత్రంతో తీసివేశారు.అడ్డగోలుగా చెట్లను తొలగించి గౌడన్నల కడుపు కొట్టిన భూ యజమాని పై దర్యాప్తు చేసి వెంటనే కేసు నమోదు చేయాలని గీతన్నలు కోరుతున్నారు.ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నప్పటికీ రెవిన్యూ,ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని మరి కొద్ది రోజుల్లో రాబోయేది వేసవికాలం కాబట్టి వేసవిలో దారి మీద ఎండలో వస్తున్నటువంటి బాటసారి లు ఆరోగ్య పరిస్థితులను గుర్తు పెట్టుకుని కళ్ళు ను త్రాగితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుతుందని ప్రజలు ఆరోగ్యరీత్యా కూడా కల్లు చాలా ఆరోగ్యంగా ఉంటదని వేసవి కాలంలో కళ్ళు త్రాగడానికి ప్రజలు ఇష్టపడతారు కాబట్టి పేదలైనటువంటి గీతన్నలు జీవనాధారంగా బ్రతుకుతెరువు కోసం ఈ కళ్ళును చెట్టు ఎక్కి గీసి కష్టపడి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి జీవనాన్ని కొనసాగించుకుంటారు.

Also Read : సి ఎం కె సి ఆర్ కి విన్నపం

అలా బ్రతికే గీతన్నల జీవనాధారమైనటువంటి తాటి చెట్లను తొలగించటం బాధాకరంగా ఉందని కల్లుగీత కార్మికులు వాపోతున్నారు అలా తాడిచెట్లను తొలగించిన వారిపై భూ యజమాని అయినా సరే ఇంకెవరైనా సరే ఎక్సైజ్ శాఖ వారు తగు చర్యలు తీసుకోవాలని గౌడ్ అన్నలు మూకుమ్మడిగా కోరుకుంటున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube