అధిక సాంద్రత పత్తి సాగు పై అవగాహన కల్పించడం

అధిక సాంద్రత పత్తి సాగు పై అవగాహన కల్పించడం

1
TMedia (Telugu News) :

అధిక సాంద్రత పత్తి సాగు పై అవగాహన కల్పించడం
టీ మీడియా, జూన్21, మధిర: రైతు వేదిక నందు నక్కలగరుబు,సిరిపురం గ్రామాల నుండి అధిక సాంద్రత పత్తి పథకం కు ఎంపికైన రైతులకు అధిక సాంద్రత పత్తి సాగు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధిర ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ రుక్మిణి దేవి, వేణుగోపాల్ మాట్లాడుతూ… అధిక సాంద్రత పత్తి సాగు అనగా పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య ,వరుసల మధ్య దూరం తగ్గించి ఎకరాకు ఎక్కువ మొక్కలు వచ్చే విధంగా అనగా వరుసల మధ్య 80సెంటీమీటర్లు మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు (80*20 cm) విత్తుకుంటే 25000 మొక్కలు వస్తాయి. ఈ పద్ధతిలో మొక్కల సాంద్రత ఎక్కువ ఉండటం వల్ల ఎక్కడానికి 12 నుంచి 15 క్వింటాళ్లు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది.

Also Read : అగ్నిపథ్ పథకాన్ని వెనక్కు తీసుకోవాలి..

ఈ పద్ధతిలో మొక్కల పెరుగుదల నియంత్రించే హార్మోన్ మేపిక్వాట్ క్లోరైడ్(చమత్కర్) 5 శాతం పంట వేసిన 45 రోజు ,75 వ రోజు, 1 మిల్లీలీటర్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకుంటే మొక్కలు గుబురుగా పెరగక, కాయలు బరువుగా ఒకేసారి పత్తి తీతకు కు రావడం వల్ల అ పంటకాలం తగ్గి యాసంగిలో రెండో పంటకు అనువుగా ఉంటుంది.పంట తొందరగా చేతికి రావడం వల్ల గులాబి రంగు పురుగు ఉధృతి తగ్గుతుంది .అలాగే రైతులు ఆరుతడి పంటలను వేసుకోవడం వలన సుస్థిర దిగుబడులు పొందవచ్చునని తెలిపారు. ఈ విధానం లో వర్షాధార తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి.

Also Read : దళిత రత్న అవార్డ్ గ్రహీత పప్పుల వేణుగోపాల్

ఈ కార్యక్రమంలో మధిర ఏ డీ ఏ కొంగర వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మండల రైతు బంధు సమన్వయ కమిటీ చైర్మన్ చావా వేణు, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, నూజివీడు కంపెనీ డిస్ట్రిబ్యూటర్ రమణారెడ్డి, కృష్ణారావు, వ్యవసాయ విస్తరణాధికారి సింధూర్, వంశీకృష్ణ, కమల్ హాసన్ రైతులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube