పాఠశాలలో సైబర్ అవగాహన సదస్సు

పాఠశాలలో సైబర్ అవగాహన సదస్సు

1
TMedia (Telugu News) :

పాఠశాలలో సైబర్ అవగాహన సదస్సు

టీ మీడియా, అక్టోబర్ 29, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మణిగిల్లలో షీ టీం బృందం సైబర్ శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. వాట్సాప్, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ల వల్ల ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారో అమ్మాయిలు ఏ విధంగా వేధింపబడుతున్నారో వివరంగా షీ టీమ్ సబ్ ఇన్‌స్పెక్టర్ స్వాతి తెలియజేశారు. ఈవ్ టీజింగ్ కు పాల్పడిన వాళ్ల నుండి అమ్మాయిలు సురక్షితంగా ఉండడం కోసం షీ టీం అండగా ఉంటుందని, పోలీసు వ్యవస్థతో కలిసి నడవాలని సూచించారు.

Also Read : బుద్ధా వెంకన్న నిరాహార దీక్ష భగ్నం

జడ్పీహెచ్ఎస్ మనిగిల్ల పాఠశాల సైబర్ అంబాసిడర్లు షర్మిల, స్పందన ఈ సందర్భంగా సైబర్ నేరాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు
పి శంకర్ గౌడ్,షీ టీం అధికారులు స్వాతి, శ్రీనివాసులు, కృష్ణ, ఉపాధ్యాయులు విజయ్ కుమార్ ,విష్ణువర్ధన్ ,బాలాజీ ,సురేఖ, సిఆర్పి లావణ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube