విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయాలి

1
TMedia (Telugu News) :

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయాలి

టీ మీడియా ,సెప్టెంబర్ 3,తిరుమలాయపాలెం : మండలం సుబ్లేడు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎందు 150 మంది విద్యార్థులు చదువుతుండగా అందులో సగం పైగా విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల నుండి కాలినడకన వస్తు ప్రతిరోజు సుమారు 10 కిలోమీటర్లు నడవవలసి వస్తున్నందున విద్యార్థుల ఇంటికి ఆలస్యంగా చేరుకుంటున్నారని ఒక్కో రోజు రాత్రి సమయం అవుతుందని అమ్మాయిలు ఇంటికి ఆలస్యంగా వస్తువున్నారని తల్లిదండ్రులు భయంతో ఎదురుచూస్తూ ఉంటున్నారు గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం తక్షణమే సైకిళ్లు పంపిణీ చేసి విద్యార్థులను ఆదుకోవాలని యువజన నాయకులు కొండా నాగరాజు పత్రికా ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు

 

Also Read : మరుగు దొడ్ల నిర్మాణం వాడకం గురించిపరిశీలన

. మోడిదపల్లి, హస్నాబాద్,ఇస్లావత్ తండా, రఘునాథ పాలెం, లక్ష్మి దేవిపల్లి తండా, మహ్మదపురం గ్రామాల నుండి 40 మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ పాఠశాలకు వస్తున్నారని, విద్యార్థులకు ప్రభుత్వం సైకిల్ అందిస్తే చదువుకొనుటకు సమయం కలిసొస్తుందని,వారు చదువులో రాణించుటకు అవకాశం ఉంటుందని, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లు మంజూరు చేశారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విద్యా సంవత్సరం నుండి చదువుతున్న విద్యార్థులపై దృష్టి పెట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ అందించాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube