పెళ్లింట్లో పేలిన సిలిండర్‌..

ఐదుగురు మృతి, 60 మందికి గాయాలు

1
TMedia (Telugu News) :

పెళ్లింట్లో పేలిన సిలిండర్‌..

-ఐదుగురు మృతి, 60 మందికి గాయాలు

టీ మీడియా, డిసెంబర్ 9, జోధ్‌పూర్‌ : రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకున్నది. పెండ్లింట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 60 మంది గాయపడ్డారు. జోధ్‌పూర్‌లోని భుంగ్రా గ్రామంలో ఓ ఇంట్లో వివాహ వేడుక జరుగుతున్నది. ఈ క్రమంలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంట్లో సిలిండర్‌ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అక్రమంగా అవి ఇళ్లు మొత్తం వ్యాపించడంతో నలుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.

Also Read : హోటల్‌ గదులను తలపిస్తున్న

స్థానికుల సహకారంతో గాయపడినవారిని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారని, వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube