భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్‌ ధర

రెండు నెలల్లోనే రూ.372 - భారం

1
TMedia (Telugu News) :

భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్‌ ధర

-ఒకేసారి రూ.104 వడ్డింపు -హైదరాబాద్‌లో రూ.2563.5 -రెండు నెలల్లోనే రూ.372 – భారం
టి మీడియా,మే 01,న్యూఢిల్లీ: దేశంలో ధరల మోత మోగుతున్నది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై పెట్రోలియం కంపెనీలు మరోసారి భారం మోపాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్‌పై భారీగా వడ్డించాయి. నెలవారీ సమీక్షలో భాగంగా ఒకేసారి రూ.104 పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.2563.5కి పెరిగింది.

Also Read : యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

గతంలో ఇది రూ.2460గా ఉన్నది.ఇక దేశ రాజధాని ఢిల్లీలో రూ.102.5లు పెరగడంతో రూ.2355.5కు చేరింది. ముంబైలో రూ.2329.50, కోల్‌కతాలో రూ.2477.50, చెన్నైలో రూ.2508కి పెరిగింది.గత నెల 1న కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.268.5 వడ్డించాయి. తాజాగా మరో రూ.104 పెరగడంతో రెండు నెలల్లోనే రూ.372 ప్రజలపై భారం మోపాయి. అయితే గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ ధర పెరగకపోవడం సంతోషించదగిన విషయమే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube