డయల్ 100 కాల్ కి వెంటనే స్పందన

వర్షంలో చిక్కుకున్న మహిళను పోలీస్ వాహనంలో ఇంటికి చేర్చిన జైపూర్ పోలీసులు

1
TMedia (Telugu News) :

డయల్ 100 కాల్ కి వెంటనే స్పందన
-వర్షంలో చిక్కుకున్న మహిళను పోలీస్ వాహనంలో ఇంటికి చేర్చిన జైపూర్ పోలీసులు

టి మీడియా, జులై 9,జైపూర్ :పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకుమట్ల గ్రామ శివారులో గల టేకుమట్ల వాగు రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు ఉధృతిగా పారడంతో తన తల్లి గారి ఇంటికి వెళ్లిన వెన్నంపల్లి సునీత అనే మహిళ తిరిగి ఇందారం గ్రామం కు వచ్చే క్రమంలో ఆటో డ్రైవరు వాగు లో నీటి ప్రవాహ ఉద్ధృతి ఎక్కువ ఉండడంతో అక్కడే దింపి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న మహిళ వెంటనే 100 నెంబర్ కి ఫోన్ చేయడం జరిగింది. సమాచారం అందిన వెంటనే జైపూర్ ఎస్ఐ రామకృష్ణ గారు వెంటనే స్పందించి తన సిబ్బందితో హుటాహుటిన తన పోలీసు వాహనంలో టేకుమట్ల వాగు దగ్గరికి చేరుకుని ఒంటరిగా ఉన్న మహిళను తన వాహనంలో ఎక్కించుకొని ఇందారంలోని తన ఇంటి వద్ద చేర్పించడం జరిగింది దీన్ని గమనించిన సునీత కుటుంబ సభ్యులు జైపూర్ ఎస్ఐ రామకృష్ణ గారికి మరియు పోలీసులకు కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.

 

Also Read : వంట నూనెలు రేటు తగ్గింపు

అంతేగాక గ్రామ ప్రజలు జైపూర్ పోలీసులు కష్టకాలంలో చేసిన సహాయాన్ని గురించి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జైపూర్ ఎస్ఐ రామకృష్ణ గారు మాట్లాడుతూ కష్టకాలంలో ఎవరున్నా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించడంలో పోలీసులు ముందుంటారని తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube