ఘనంగా దళిత జర్నలిస్టుల ఫోరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఘనంగా దళిత జర్నలిస్టుల ఫోరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఘనంగా దళిత జర్నలిస్టుల ఫోరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
టీ మీడియా, డిసెంబర్ 9, వనపర్తి బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టంగా తీసుకుని అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని రెండో విడతలో దళిత జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నాగర్ కర్నూల్ జిల్లా దళిత ఫోరం అధ్యక్షుడు పి.వెంకటస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆవరణలో దళిత జర్నలిస్టుల ఫోరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి దళిత జర్నలిస్టుల ఫోరం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు పి. వెంకటస్వామి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దళిత జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, బస్సు,రైల్లో ఎలాంటి రుసుములు చేయకుండా ఉచిత పాస్ సౌకర్యాన్ని కల్పించాలని,కార్పొరేట్ హాస్పిటల్లో అమలయ్యే విధంగా,అక్కడేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డులను అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.జర్నలిస్టు వృత్తినే నమ్ముకొని ఉన్న జర్నలిస్టులకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, కరోనాలో మృతి చెందిన దళిత జర్నలిస్టులకు 20 లక్షల ప్రకటించాలని
Also Read : ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో
అనివార్య కారణాలవల్ల అంగవైకల్యం చెందిన జర్నలిస్టులకు జీవితకాలం పింఛన్ రూపంలో నెలకు 5000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఔట శ్రీనివాసులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సుదర్శన్ జిల్లా మీడియా ఇన్ఛార్జి ఎద్దుల వెంకటేష్,తిప్పర్తి వినోద్,జిల్లా కార్యదర్శి పరశురాం, బంగారయ్య బి.శ్రీను. తరుణ్.శ్రీకాంత్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube