హుజురాబాద్ లో దళిత బంధు నిలుపుదల పట్ల నిరసన
దళితుల నోటి దగ్గర కూడు లాగేసే ప్రయత్నాలు బీజేపీ మానుకోవాలి
టీ మీడియా, అక్టోబర్ 19, మధిర :
కేంద్ర ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకుని హుజురాబాద్ లో దళితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు పథకాన్ని నిలుపుదల చేయాలని కేంద్రంలో అధికార బీజేపీ పార్టీ చేసిన కుట్రలకు నిరసనగా మధిర పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు టీ ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, రైతు బంధు మండల కన్వీనర్ చావా వేణు, అర్బన్ పార్టీ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, మధిర మున్సిపల్ ప్లోర్ లీడర్ యన్నంశేట్టి అప్పారావు గారు మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, యూత్ జిల్లా నాయకులు కూన నరేందర్ రెడ్డి,యూత్ కార్యదర్శి గద్దల రాజా, నాయకులు మెడికొండ కిరణ్, ఓంకార్,పల్లపోతుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.