రామ మందిరం నిర్మాణ ప్రాంతంలో డ్యాన్సులు..
-మహిళా కానిస్టేబుళ్లపై వేటు
టీ మీడియా, డిసెంబర్ 16, అయోధ్య : అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ ప్రాంతంలో డ్యాన్సులు చేసిన నలుగురు మహిళా కానిస్టేబుళ్లను అధికారులు శుక్రవారం సస్పెండ్ చేశారు. ఆలయ నిర్మాణం నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ విధుల్లో ఉన్న నలుగురు మహిళా కానిస్టేబుళ్లు భోజ్పూర్ పాటకు కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో అధికారులు సదరు కానిస్టేబుళ్లపై చర్యలకు ఉపక్రమించారు. అదనపు ఎస్పీ పంకజ్ పాండే దాఖలు చేసిన విచారణ నివేదిక ఆధారంగా కానిస్టేబుళ్లు కవితా పటేల్, కామినీ కుష్వాహ, కాశిష్ సాహ్ని, సంధ్యా సింగ్లను సస్పెండ్ చేస్తూ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మునిరాజ్ ఆదేశించారు.