పత్తి కొనుగోలు లో దందా

-కౌంటర్ల ద్వారా జీరో వ్యాపారం

0
TMedia (Telugu News) :

పత్తి కొనుగోలు లో దందా

-కౌంటర్ల ద్వారా జీరో వ్యాపారం

-మార్కెట్ ఆదాయానికి గండి

-తుకాల్లో రైతు ల కు టో కరా

టీ మీడియా, జనవరి 5, ఖమ్మం బ్యూరో : ఎలాంటి అనుమతులు లేకుండా ఉమ్మడి ఖమ్మంజిల్లా తల్లాడలో పెద్ద ఎత్తున పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అనుమతులు లేకుండ కొంతమంది అధికారులు సహా సహకారం తోఅక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. భారీగా ప్రభుత్వ అదాయానికి గండి పెడుతున్నారు.కొనుగోలు కేంద్రాల వద్ద దళారుల దందా కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదాయానికి మార్కెట్ శాఖకు రావలసిన లక్షలాది రూపాయల ఆదాయం కోల్పోతుంది.ఖమ్మం వైరా, కొత్త గూడెం, ఏనుకూరు తదితర వ్యవసాయ మార్కెట్ ల పరిధిలో ఎక్కువ గా ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది.ఎలాంటి నిబంధనలు పాటించకుండా అనుమతులు తీసుకోకుండా సుమారు 170చోట్ల పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నారు. ఈ పత్తి కొనుగోలు కేంద్రాలకు అనుమతులు లేకుండా కొనసాగుతున్న అధికార యంత్రాంగం ఎవరు పట్టించుకోవడం లేదు అనదికార పత్తి కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు వ్యవసాయ మార్కెట్ కు చెందినకొంతమంది మధ్య ఉన్న రహస్య ఒప్పందమే కారణంగా తెలుస్తోంది. కొన్ని కేంద్రలను అధికారులు సందరించి మేము వచ్చాము, ఆ కొనుగోలు కేంద్రాలను చూశాము, మీపై కేసులు నమోదు చేస్తామని చెప్పి వెళ్ళిపోతున్నారు. తప్ప ప్రభుత్వం ఆదాయాన్ని పెంచాలని ఆలోచన అధికారులకు లేదు.

Also Read : రెండేళ్ల పసి కందును కడతేర్చిన కసాయి తండ్రి

అసలు అనుమతులు తీసుకోకుండా ఇంత పెద్ద ఎత్తునఅనాlది కారపత్తి కొనుగోలు కేంద్రాలు కొనసాగుతుంటే పర్యవేక్షించవలసిన అధికారులు ఎందుకు అటు వైపు గుట్టు చప్పుడు కాకుండా ఉంటున్నరో ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని అనుమతులు లేకుండా చేస్తున్న పత్తి వ్యాపారాలపై చర్యలు తీసుకొని వ్యవసాయ మార్కెట్ కి వచ్చే ఆదాయాన్ని పెంచాలని ప్రజలు కోరుకుంటున్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube