కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 21, మహానంది:

ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ పిలుపుమేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత కల్పించాలని, మంగళవారం మహానంది మాదిగ విద్యార్థుల తరపున మోదీ తాతయ్య ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి మాదిగలకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ మహానంది తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం తాసిల్దార్ జనార్దన్ శెట్టి కి ఎపి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మధు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎపి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మధు మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ కొరకు గత 26 సంవత్సరాలుగా వందలాది మంది ప్రాణాలను త్యాగాలు చేశారని, ఎపి ఎమ్మార్పీఎస్​ మండల అధ్యక్షుడు మధు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్ మహానంది మండలం అధ్యక్షుడు మధు , గ్రామ నాయకులు రమేష్, జి. నరసింహ, శేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube