సూర్యప్రభ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో శ్రీ క‌ల్యాణ శ్రీనివాసుడు దర్శనం

సూర్యప్రభ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో శ్రీ క‌ల్యాణ శ్రీనివాసుడు దర్శనం

0
TMedia (Telugu News) :

సూర్యప్రభ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో శ్రీ క‌ల్యాణ శ్రీనివాసుడు దర్శనం

లహరి, ఫిబ్రవరి 17, తిరుపతి : శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించారు. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత అని తిరుమల వేద పండితులు తెలిపారు. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారని అన్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడేనని పేర్కొన్నారు.

Also Read : జమ్ముకశ్మీర్‌లో 3.6 తీవ్రతతలో స్వల్ప భూకంపం

సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని వారు వెల్లడించారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్‌ సేవ వైభవంగా నిర్వహించనున్నామని వివరించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube