దివ్యాంగులు, వృద్ధులకు దర్శన కోటా టికెట్లు విడుదల
లహరి, ఫిబ్రవరి 14, తిరుమల : తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే దివ్యాంగులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు దర్శన కోటా టికెట్లను మంగళవారం టీటీడీ వెబ్ సైట్ లో పెట్టింది. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన టోకెన్లను టీటీడీ అధికారులు ఆన్ లైన్ లో విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని సంబంధిత అధికారులు భక్తులకు సూచించారు. మిగతా భక్తులు టీటీడీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఆన్‌లైన్ ద్వారా ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకుని శ్రీవారిని దర్శించుకోవచ్చని స్పష్టం చేసింది.