జల్లేపల్లి గ్రామంలో విజయ దశమి వేడుకలు

జల్లేపల్లి గ్రామంలో విజయ దశమి వేడుకలు

1
TMedia (Telugu News) :

జల్లేపల్లి గ్రామంలో విజయ దశమి వేడుకలు

టీమీడియా, అక్టోబర్ 6, పాలేరు: మండల పరిధిలోని జల్లేపల్లి గ్రామంలో ఘనంగా విజయదశమి వేడుకలు గ్రామ సర్పంచ్ భాషబోయిన శైలజ వీరన్న ఆధ్వర్యంలో నిర్వహించారు.గత 20 సంవత్సరాల తరువాత పండుగను నిర్వహించడం గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముదిరాజ్ ల కులపెద్ద దడిదల వెంకన్న,గొర్రెపోతు ను ఖడ్గంతో గ్రామ ప్రజల మధ్య నరకడం అనవయితీగా వస్తుంది.సొరకాయను దడిదాల నరసయ్య బలిచ్చారు. చోప్పను దడిదల గోపి తీసుకురాగా,కసరా గంపను పుల్లూరి బిక్షపతి తెగా దడిదాల శ్రీను రావణాసురుడని తీసుకొచ్చారు.

Also Read : పప్పుల భద్రయ్య ను పరామర్శించిన భానోత్ రవి

అనంతరం గ్రామ సర్పంచ్ శైలజ వీరన్న బాణం వదిలి రావణాసురుడుణి దగ్ధం చేసి విజయ సంకేతం తెలిపి మండలంలోని ప్రజల కష్టాలన్నీ దసరాతో తీరిపోవాలని ఆశిస్తూ..విజయ దశమి శుభాకాంక్షలు తెలియచేసారు.దసరా సందర్భంగా రావణుడి దిష్టిబొమ్మతో పాటు మీలో ఉన్న అహం,ద్వేషం,కోపాలను కాల్చాలని విలేకర్లతో అన్నారు.అనంతరం గ్రామ ప్రజలతో కలిసి పాలపిట్టనుచూశారు.ఈ కార్యక్రమంలో సగ్గుర్తి నవీన్, ఈడబోయిన సైదులు,ఇండ్ల రవి,దడిదల పెద్ద శ్రీను,మెట్టు యాకయ్య,అనేపర్తి దర్గయ్య, లపంగి రాములు,పుల్లూరి వెంకయ్య,కోట్ల వాసుదేవరావు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube